Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
21 verses
1అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతి... బొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరిని నాశనము చేసెను.
2రాజైన యెహోరాము కుమార్తెయును అహ జ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారు డైన యోవాషును, హతమైన రాజకుమారులతోకూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడ కుండెను.
3అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడ దాచబడి యుండెను.
4ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరము లోనికి వారిని తీసికొని పోయి, యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞా పించెను
5మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతి దిన మున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;
6ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను.
7మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.
8మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని రాజుచుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవే శించినయెడల వాని చంపవలెను, రాజు బయలుదేరి సంచ రించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను.
9శతాధి పతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞ లన్నిటి ప్రకారము చేసిరి, ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను.
10యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా
11కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠముచెంతను మందిరముచెంతను మందిరము కుడి కొన మొదలుకొని యెడమ కొనవరకు రాజుచుట్టు నిలిచిరి.
12అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మ శాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తర��వాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టిరాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.
13అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి
14రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభముదగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొనిద్రోహము ద్రోహము అని కేక వేయగా
15యాజకుడైన యెహో యాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక
16రాజమందిరములోనికి గుఱ్ఱములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి.
17అప్పుడు యెహోయాదాజనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోను జనులతోను నిబంధన చేయించెను, మరియు అతడు రాజుపేరట జనులతో నిబంధన చేయించెను.
18అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతి మలను ఛిన్నాభిన్నములుచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను.
19అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములో నున్న రాజునుతీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గ మున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.
20మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులంద రును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.
21యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.