Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
28 verses
1ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడియూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి.
2అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి.
3కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడపిరి. ప్రభువు వారిచేత సూచకక్రియలను అద్భుతములను చేయించి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించు చుండెను.
4ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి.
5మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువి్వ చంపవలెనని యుండిరి.
6వారాసంగతి తెలిసికొని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.
7లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను.
8అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.
9అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి
10నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.
11జనసమూహ ములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో --దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చి యున్నారని కేకలువేసి,
12బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.
13పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.
14అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి
15అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.
16ఆయన గతకాలములలో ��మస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను.
17అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.
18వారీలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండ సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను.
19అంతియొకయనుండియు ఈకొనియనుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువి్వ అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.
20అయితే శిష్యులు అతనిచుట్టు నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, మరునాడు బర్నబాతోకూడ దెర్బేకు బయలుదేరి పోయెను.
21వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్ర కును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి
22శిష్యుల మనస్సులను దృఢపరచివిశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.
23మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమి్మన ప్రభువునకు వారిని అప్పగించిరి.
24తరువాత పిసిదియ దేశమంతట సంచ రించి పంఫూలియకువచ్చిరి.
25మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి.
26అక్కడనుండి ఓడ యెక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై, మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి.
27వారు వచ్చి, సంఘమును సమ కూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యము లన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు, వివరించిరి.
28పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడపిరి.