Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
27 verses
1యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టు కొనుము, నీళ్లలో దాని వేయకుము.
2కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.
3రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
4నీవు కొని నడుమున కట్టుకొనిన నడి కట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా
5యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని.
6అనేక దినములైన తరువాత యెహోవానీవు లేచి యూఫ్రటీసునొద్దకు పోయి, నేను అక్కడ దాచి పెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడనుండి తీసి కొనుమని నాతో చెప్పగా
7నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసి కొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి యుండెను; అది దేనికిని పనికిరానిదాయెను.
8కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను
9యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూష లేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును.
10అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగు దురు.
11నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
12కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడునుప్రతి సిద్దెయు ద్రాక్ష��� రసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన యెడల
13నీవు వారితో ఈ మాట చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగాఈ దేశనివాసుల నందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజుల నేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివా సులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.
14అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏక ముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింప జేసెదను.
15చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.
16ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవు డైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.
17అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.
18రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుముమీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.
19దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్ట బడిరి; ఏమియు లేకుండ సమస్తము కొనిపోబడెను.
20కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ నున్నది?
21నీవు నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీమీద అధిపతులుగా నియ మించునప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నిన్ను పట్టును గదా?
22నీవుఇవి నా కేల సంభవించెనని నీ మన స్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోష ములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను.
23కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చు కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.
24కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను.
25నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
26కాబట్టి నీ అవమానము కనబడు నట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను.
27నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయ క్రియలు నాకు కనబడు చున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచు కొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?