Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
20 verses
1అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను
2ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా.వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
3నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
4నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
5దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు
6ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువునీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.
7దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?
8అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు?పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?
9దాని పరిమాణము బ ³ూమికంటె అధికమైనదిదాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది
10ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసివ్యాజ్యెమాడ పిలిచినప్పుడుఆయన నడ్డగింప గలవాడెవడు?
11పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదాపరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదోఆయనే తెలిసికొనును గదా.
12అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగానిబుద్ధిహీనుడు వివేకికాడు.
13నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడలనీ చేతులు ఆయనవైపు చాపినయెడల
14పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచినయెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల
15నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవునిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.
16నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవుదాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లునీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.
17అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించునుచీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.
18నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు.నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు.
19ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు.
20దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదుప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.