Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
17 verses
1అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది
3ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగాఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.
4ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదనువాదములతో నా నోరు నింపుకొనెదను.
5ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అదినేను తెలిసికొందునుఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.
6ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును
7అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును.కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలనశిక్ష నొందకపోవుదును.
8నేను తూర్పుదిశకు వెళ్లినను ఆయన అచ్చట లేడుపడమటిదిశకు వెళ్లినను ఆయన కనబడుట లేదు
9ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయిననుఆయన నాకు కానవచ్చుట లేదుదక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను.
10నేను నడచుమార్గము ఆయనకు తెలియునుఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును.
11నా పాదములు ఆయన అడుగుజాడలు విడువకనడచినవినేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నను సరించితిని.
12ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగలేదుఆయన నోటిమాటలను నా స్వాభిప్రాయముకంటె ఎక్కువగా ఎంచితిని.
13అయితే ఆయన ఏకమనస్సుగలవాడు ఆయనను మార్చ గలవాడెవడు?ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును.
14నాకు విధింపబడినదానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడైయున్నాడు.
15కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నానునేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.
16దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను.
17అంధకారము కమ్మియుండినను గాఢాంధకారము నన్ను కమ్మియుండిననునేను నాశనముచేయబడి యుండలేదు.