Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
30 verses
1ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను
2నా దుఃఖము చక్కగా తూచబడును గాకదాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులోపెట్టబడును గాక.
3ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రములఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని.
4సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.
5అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా?
6ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా?
7నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను.
8ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాకనేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక
9దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక.
10అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును
11నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?
12నా బలము రాళ్ల బలమువంటిదా?నా శరీరము ఇత్తడిదా?
13నాలో త్రాణ యేమియు లేదు గదా.శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.
14క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మాను కొనిననుస్నేహితుడు వానికి దయచూపతగును.
15నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.
16మంచుగడ్డలుండుటవలననుహిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును
17వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
18వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును.
19సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురుషేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు.
20వారు వాటిని నమి్మనందుకు అవమానమొందుదురువాటి చేరువకు వచ్చి కలవరపడుదురు.
21అటువలె మీరు లేనట్టుగానే యున్నారుమీరు ఆపదను చూచి భయపడుచున్నారు.
22ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా?
23పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడనియడిగితినా?
24నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదనుఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకుతెలియజేయుడి.
25యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?
26మాటలను గద్దించుదమని మీరనుకొందురా?నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.
27మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు,మీ స్నేహితులమీద బేరము సాగింతురు.
28దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా?
29అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడిమరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.
30నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా?