Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
15 verses
1నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూ మునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.
2యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయు వాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.
3యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.
4ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడి పోవును లెబానోను పుష్పము వాడిపోవును.
5ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.
6ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవా డెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.
7యెహోవా ఉత్త ముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమి్మకయుంచువారిని ఆయన ఎరుగును.
8ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,
9యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.
10ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.
11నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైనవాటిని బోధించినవా డొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.
12యెహోవా సెలవిచ్చునదేమనగావారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూల మగుదురు; నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.
13వారి కాడిమ్రాను నీమీద ఇక మోప కుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.
14నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చు నదేమనగానీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియు లేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.
15సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లిం పుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.