Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
7 verses
1దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు.
2వివేకము కలిగి దేవుని వెదకు��ారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను
3వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారుమేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
4యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు.
5ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్ష మున నున్నాడు
6బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.
7సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.