Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
12 verses
1అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
2మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అ��ి చెప్పుకొనుచు
3భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికినివిరోధముగా నిలువబడుచున్నారుఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.
4ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడుప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
5ఆయన ఉగ్రుడై వారితో పలుకునుప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును
6నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను
7కట్టడను నేను వివరించెదనుయెహోవా నాకీలాగు సెలవిచ్చెనునీవు నా కుమారుడవునేడు నిన్ను కనియున్నాను.
8నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగానుభూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
9ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవుకుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగాపగులగొట్టెదవు
10కాబట్టి రాజులారా, వివేకులై యుండుడిభూపతులారా, బోధనొందుడి.
11భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడిగడగడ వణకుచు సంతోషించుడి.
12ఆయన కోపము త్వరగా రగులుకొనునుకుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.