Loading Bible Translation
First-time download in progress. This may take a few seconds…
Telugu Holy Bible Wordproject Bible
9 verses
1ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.
2పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాకసీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.
3ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాకనీ దహనబలులను అంగీకరించును గాక.
4నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.
5యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాముమా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నామునీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.
6యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియునురక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపునుతన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును.
7కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురుమనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
8వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.
9యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక.