ఐదు గాయము లొందినావా నాకొర కైద
Christian Song Lyrics
Teluguఐదు గాయము లొందినావా నాకొర! కైదు గాయము లొంది నావా
ఐదు గాయముల నా యాత్మఁ దలంప నా కారాట మెచ్చినదే నీ మైదీగె
నావంటి మర్త్యుల పాల్జేసి మరణ మొందితివి గదే ||ఐదు||
1. గార మైన నీ శ రీర రక్త మిలను ధారయై కారినదా నా నేరమా
యయ్యది భారమై నీ పైని ఘోరమై యొరిగినదా ||ఐదు||
2. అందమౌ నీ తనువు కంది రక్త స్వేద బిందువులై రాలెనే యీ
చంద మూహింప నా డెందమ్ము భీతిచేఁ గొందలమై తూలెనే ||ఐదు||
3. ఎల్ల పాపము మోయు అల్ల దేవుని గొఱ్ఱె పిల్లవు నీవేగదా నా
వల్లనా నీ కింత యల్లాట పుట్టెనే చెల్ల తాళునె నా యెద ||ఐదు||
4. భంగమౌనట్టి దు ష్పాపులఁ గావ నీ ప్రాణ మర్పించితివా యీ
సంగతిఁ జూడ నీ సాహస మింక నే భంగి నీ జగతి మరవ ||ఐదు||
5. ఆయాసమైన నీ యాపదలెల్ల నే నాలోచింపఁగ నాత్మలో నెడ
బాయక తద్దివ్య పాదసరోజముల్ భాసిల్లు నా యాత్మలో ||ఐదు||