లేచినాడురా
Christian Song Lyrics
Teluguలేచినాడురా
సమాధి గెలచినాడురా (2) యేసు
లేతునని తా చెప్పినట్లు (2)
లేఖనములలో పలికినట్లు ||లేచినాడురా||
భద్రముగా సమాధిపైన
పెద్ద రాతిని ఉంచిరి భటులు (2)
ముద్ర వేసి రాత్రి అంతా (2)
నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా||
పాప భారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు (2)
నరక బాధ లేదు మనకు (2)
పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా||
యేసునందే రక్షణ భాగ్యం