ఈ జీవిత ఈత ఈదలేకున్నాను నా చే
Christian Song Lyrics
Teluguఈ జీవిత ఈత ఈదలేకున్నాను
నా చేయి పట్టుకో నా యేసునాధా
1. సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను
సాయంబురావా సారాకరుణారసధారలే నా కొసగుము
సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము
2. సంఘసంబంధముగ శాంతి లేకపోయె సమానతత్వంబు
సమసిపోయె సోదరులే నాకు శత్రువు లయ్యిరి
సమాధానము నొసగ సరగున రావా ||ఈ||
3. బయట పోరాటములు భయపెట్టుచుండెను బంధువులందరు
బహుదూరులైరి భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె
బాధలన్నియు బావ బహుత్వరగ రావా ||ఈ||
4. రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె రాష్ట్రముపై
రాష్ట్రంబు రగులుచుండె రాజులకు రాజువై రయమున
రావయ్య రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము ||ఈ||
5. సైతాను చెలరేగి సమయం బిక లేదని సింహపురీతిగా