ఈ రేయి చల్లనిది
Christian Song Lyrics
Teluguఈ రేయి చల్లనిది
ఇహ పరాల పెన్నిధి
రమ్యమాయె రాతిరి
రాజు యేసు రాకచే
ఆది ఆదాము దోషము
అఖిల జగతి దాస్యము
అంతరించగ దైవము
అవతరించిన సుదినము
మానవాళి పాపము
మానిపోని తాపము
తొలగె తండ్రి కోపము
కలిగె రక్షణ భాగ్యము
ఇహము పరము కలిసెను
ఇలలో స్వర్గము వెలిసెను
అంధకార అవనిలో
అమర జ్యోతి వెలిగెను
ఈ రేయి చల్లనిది — English