ఈ లోకము నను విడచినను
Christian Song Lyrics
Teluguఈ లోకము నను విడచినను
నను విడువని నా దేవుడవు
ఎవ్వరు లేని ఈ జీవితములో
నా తోడు నీవై – నన్నాధుకొంటివి
నా హృదయమంత నీ కొరకే సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచేదను యేసు
నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను
సొలిపోయినా నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి.
నన్నాధరించి – చేరదీసి
కన్నీరు తుడచి – హత్తుకొంటివి
నా హృదయమంత నీ కొరకే సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచేదను యేసు
నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను.
యేసయ్యా…..
నా చింతలన్ని తీరెనయ్య – నిన్ను చేరిన క్షణమే.
నిత్య జీవితం దొరికేనయ్యా- నిన్ను చూసిన క్షణమే. (3)
నా వ్యాధులన్నీ తొలిగేనయ్య – నిన్ను తాకిన క్షణమే