ఊహకందని ఉపకారములు కృప వెంబడి కృపలు
Christian Song Lyrics
Teluguఊహకందని ఉపకారములు, కృప వెంబడి కృపలు
మరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములు
యేసయ్యా నీవే ఆధారమయ్యా
నా మంచి కాపరి నీవేనయ్యా
నూనెతో నా తలనంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది
నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును
పచ్చిక చోట్లలో పరుండచేయును, శాంతికర జలములకు నడుపును
నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును
గాఢాంధకారములో నడిచిననూ, నాకు తోడుగా నీవుందువు
ఏ తెగులును నా దరి రానీయక ప్రతీ కీడు నుండి తప్పించును
ఊహకందని ఉపకారములు కృప వెంబడి కృపలు — English
oohakandani upakaaramulu, krupa vembadi krupalu
maruvaleni needhu melulu, varninchaleni vaathsalyamulu