ఊహించలేదయ్య దీవిస్తావని
Christian Song Lyrics
Teluguఊహించలేదయ్య దీవిస్తావని
ఊహించనే లేదయ్య కరుణిస్తావని
కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిన్ను నే సేవింతును
నమ్మకముగా యదార్ధతతో నీ కృపలో నే సాగెదన్
1. నీ ప్రేమతో నీ ఆత్మతో నన్నాధరించిన నా తండ్రివై
నా తోడువై నా నీడవై నా కడుపు నింపిన నా తల్లివై
ఏమిచ్చినా నీ ౠణము తీర్చుకోనయ్యా
ఆ బదులుగా ఏమివ్వగలనయ్య
2. ఆ వేదనలో ఆ శోధనలో నా చెంత చేరిన నా దైవమై
నీ జాడలో ఆ కల్వరిలో నా చింత తీర్చిన నా దైవమై
ఏమిచ్చినా నీ ౠణము తీర్చుకోనయ్యా
ఆ బదులుగా ఏమివ్వగలనయ్య
ఊహించలేదయ్య దీవిస్తావని — English
oohinchaledhayya dheevisthaavani