ఒంటరిని నేను ఒంటరిని
Christian Song Lyrics
Teluguవారిలో ఒంటరియైన వాడు వెయ్యిమందియగును, ఎన్నిక లేనివాడు
బలమైన జనమగును..! - యెషయా 60 : 22
పల్లవి : ఒంటరిని నేను ఒంటరిని
ఓడిపోయి నేను ఒంటరినై
ఓదార్పులేక ఓరిమిలేక
మరణమే ఇక శరణం అనుచు
అంతమవ్వాలని ఆశపడితి || ఒంటరిని ||
1. దావీదు వలె నేను శ్రమలనొందుచు
నిందకు వేదనకు వేడుకనైతిని
ఒంటరినై నేను నిను వెదకుచుండగా
నీ వాక్యముచే నను ఆదరించి
ఇదిగో నేను ఉన్నాను అని నీవు
అభయము ఇచ్చితివి యేసు దేవా! || ఒంటరిని ||
2. తప్పిపోయిన తనయుని వలె నేను
తండ్రికి దూరమై ఒంటరినైతిని
తప్పు తెలిసి క్షమీయించుమని
నీ చెంతకు నే చేరితి తండ్రి