త్రాహిమాం క్రీస్తు నాథ
Christian Song Lyrics
Teluguత్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే
నేను – దేహి యనుచు నీ పాదములే
దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం||
గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి
యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం||
నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు – చేసినాడను