శ్రమలందు నీవు
Christian Song Lyrics
Teluguశ్రమలందు నీవు నలిగే సమయమున
ప్రభు నీకు తోడుండునని
యోచించలేదా? గమనించలేదా?
ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు||
శ్రమలందు ఏలియాకు కాకోలముచేత
ఆహారము పంపించ లేదా? (2)
ఈనాడు నీకు జీవాహారముతో
నీ ఆకలి తీర్చుట లేదా? (2) ||శ్రమలందు||
శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి
రాజ్యాధికారమీయలేదా? (2)