ఏ బాధ లేదు
Christian Song Lyrics
Teluguఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2) ||ఏ బాధ||
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా