ఏ రీతి స్తుతియింతును
Christian Song Lyrics
Teluguఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా
ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును
నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా
నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||
ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు
ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను
ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా
ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||