ఓ సద్భక్తులారా
Christian Song Lyrics
Teluguఓ సద్భక్తులారా – లోక రక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు – ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
సర్వేశ్వరుండు – నర రూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము