ఏమి లేదు సుమీ జగములో యేసుని ప్
Christian Song Lyrics
Teluguఏమి లేదు సుమీ జగములో యేసుని ప్రేమ సారము కన్నను పామరం
బేటికి వృధా కను దామరలు మూయగనె చీకటి యౌ మనంబున నెల్ల
సత్యము గామి గని సర్వంబు విడువుఁ ||డేమి||
1. దార పుత్రాది బంధు శ్రేణిపై మమ కార భావము జెందుచుఁ
దద్విషయమై కోరి దుఃఖము లొందుచు భ్రమఁ గుందుచు భూరి
మాయా జాల బంధా కర మిది యని తెలియ కీ సం సార మంతయు
నాది నాదని యూరకే చెడిపోవ నేటికి ||నేమి||
2. ఈ దేహమునకుఁ బ్రాణమునకు సంబంధ మించు కైనఁ గలదా
దేహాత్మలకు భేదము గన వలదా బుద్ధి గొన వలదా యాది నే దేహము
నాత్మ స మాదరంబున నుండు నా తను వీ ధరిత్రిని విడచి చను
నపుడే దయామృతవార్ధి దిక్కగు ||నేమి||
3. జాయా పుత్రోద్యాన గృహ విత్తా ట్టాలక సకల వస్తు జాలము ప్రతిష్ఠాను
భూతి విధేయులు నఖిల సంపదలు నీ యవని లోపల సమర్పణఁ
జేయఁగా బడుఁ గాని యించుక తోయమును గొని పోవశక్యము లేద