ఓ క్రీస్తు భక్తులారా నీతి నిమ
Christian Song Lyrics
Telugu1. ఓ క్రీస్తు భక్తులారా
నీతి నిమిత్తము
పోరాడ కవచంబు
ను ధరించుడి
శక్తుండు సైన్య ప్రభు
వు, శాంతిరాజుకు
అపారసేవ జేయ
అర్పణ యైతిమి.
||జోహారు, రక్షకుండ!
నీ మార్గమందున
విజయగృహ దైవ
పురంబు బోదుము ||
2. పదండి ముందుకంచు
నాదంబు చేయుడు
స్వార్థంబు గెల్వవలె
సాగిపోదము
హర్షంబులేని యాత్మ
లెన్నెన్నొ చూడుడు
ఈ ఘోరయుద్ధమున
కందరి గూర్చుడు.