ఓ సద్భక్తులారా లోకరక్షకుండు
Christian Song Lyrics
Telugu1. ఓ సద్భక్తులారా !
లోకరక్షకుండు
బెత్లెహేమందు నేఁడు జన్మించెన్
రాజాధిరాజు
ప్రభువైన యేసు
నమస్కరింప రండి
నమస్కరింప రండి.
నమస్కరింప రండి యుత్సాహముతో.
2. సర్వేశ్వరుండు
నరరూప మెత్తి
కన్యకుఁ బుట్టి నేఁడు వేంచేసెన్
మానవ జన్మ
మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి
నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము.
3. ఓ దూతలారా!
ఉత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ నుతించుఁడి