ఇన్నేళ్లు ఇలలో
Christian Song Lyrics
Teluguఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు||
లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు||