ఇది కమనీయ కళ్యాణ రాగం
Christian Song Lyrics
Teluguఇది కమనీయ కళ్యాణ రాగం
అనురాగ దాంపత్య జీవనం
సంతోష సౌభాగ్య సంధ్యా రాగం
అభిమానులందించు దీవెన గానం
ప్రేమానురాగాలు పంచెడి గృహమై
బంధుజనాలికి ప్రీతికరముగా
ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు
ప్రభు యేసు సేవలో పయనించుడి
మధురిమలొలికే మమతల మనువు
దేవాధి దేవుని దీవెన సిరులు
కుటుంబ పరివారం పరిచర్యకంకితం
వైవాహిక జీవనం విభుడేసుకంకితం
ఇది కమనీయ కళ్యాణ రాగం — English
idi kamaneeya kalyaana raagam
anuraaga dhaampathya jeevanam