ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్త
Christian Song Lyrics
Teluguఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ
తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె ||నిశ్రా||
1. తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన
శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె ||నిశ్రా||
2. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన
పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె ||నిశ్రా||
3. జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి
మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ ||నిశ్రా||
4. ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన
సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె ||నిశ్రా||
5. ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని
వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద ||నిశ్రా||