గుండె బరువెక్కిపోతున్నది
Christian Song Lyrics
Teluguగుండె బరువెక్కిపోతున్నది
ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2)
నా మనసేమో కలవరపడుచున్నది (2)
యేసయ్యా.. ఆదరించ రావా
యేసయ్యా.. బలపరచ రావా ||గుండె||
ప్రాకారము లేని పురముగా నేనుంటిని
ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2)
నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2)
యేసయ్యా.. ఆధారం నీవే కదా