వచ్చింది వచ్చింది వచ్చింది
Christian Song Lyrics
Teluguవచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2)
మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్