వినరే యో నరులారా
Christian Song Lyrics
Teluguవినరే యో నరులారా – వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే
అనుదినమును దే-వుని తనయుని పద
వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే||
నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు – కరుణను గనరే ||వినరే||
ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష