విలువైనది నీ జీవితం
Christian Song Lyrics
Teluguవిలువైనది నీ జీవితం
యేసయ్యకే అది అంకితం (2)
ఆ దేవ దేవుని స్వరూపంలో
నిను చేసుకున్న ప్రేమ
తన రూపులో నిను చూడాలని
నిను మలచుకున్న ప్రేమ
ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది
నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ
తన కంటి రెప్పలా – నిను కాచేటి
క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా… ||విలువైనది||