అందాలతార
Christian Song Lyrics
Teluguఅందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||
విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||
యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు