అనుదినము మా భారము
Christian Song Lyrics
TeluguReference: ప్రభువు స్తుతినొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు. కీర్తన Psalm 68:19
పల్లవి: అనుదినము మా భారము - భరించే దేవా
అనిశము నీ మేళ్ళతో - నింపుచున్నావు
1. సన్నుతించు మనిశము - నా ప్రణమా యేసుని
పరిశుద్ధ నామమును - పొగడు మెప్పుడు
ఒంటె బరువు దీవెనలు - వీపున మోసె
2. నా శరీరమున ముల్లు - బాధపరచుచుండగా
వేదనతో వేడగా - ధైర్యమిచితివి
నా కృప నీ కెల్లప్పుడు - చాలునంటివి
3. అపరాధముతో మేము చిక్కుకొని యుండగా
నీ రక్తముతో మమ్ము - విమోచించితివి
నీదు కృప మహదై-శ్వర్యంబును బట్టి
4. అన్నిటిలో నెప్పుడు - సకల సంపదలతోను
సమృద్ధితో మమ్ములను - సాకుచుంటివి
కృపా క్షేమములను మాపై - కుమ్మరించితివి