అక్షయ మైనది యేసుని రక్తము
Christian Song Lyrics
Teluguఅక్షయ మైనది – యేసుని రక్తము (1 Peter 1:4)
అమరము నందున – పొందుగ నున్నది (Hebrews 9:12)
డెందము నందున – ప్రభువును పొందిన
అందలమున ప్రభు మహిమలో నుందుము
కలిగియుంటిమి – కలుషిత రక్తము
కడతేర్చు చివరకు – క్షయమగు రక్తము
జీవికి రక్తము – మూలాధారము (Deut 12:23, Lev 17:11)
అక్షయ రక్తమే – నిత్య జీవముకు (Hebrews 9:12 & 22, 1 Corinth 15:54)
మూడవ దినమున – మరణము గెలిచి
మరియను వారించే – తను తాక వద్దని (John 20:17)
మరు క్షణమేగా – పరమును చేరి (Psalm 24:9)
మందసమున తన రక్తము నుంచెను (Hebrews 9:12)
నిర్మలమైనది – వాడ బారనిది (1 Peter 1:4,18,19)
నిర్దోష మైనది – యేసుని రక్తము
పాప రహితము – పరలోక స్వాస్త్యము