అద్వితీయుడా నన్నేలు దైవమా
Christian Song Lyrics
Teluguఅద్వితీయుడా నన్నేలు దైవమా
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యములను
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం
ప్రతిఫలింపజేయునే ఎన్నడూ
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము
వర్ణించలేను స్వామీ నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా
ప్రతీ గెలుపు బాటలోన చైతన్యస్పూర్తి నీవై నడిపించుచున్న నేర్పరీ
అలుపెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై నను నిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై
తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో నీవే కదా! యేసయ్యా
నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా
నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై ఆశయాలదిగా నడిపెనే
నీ నిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి