అన్నివేళలా ఆనందమే
Christian Song Lyrics
Teluguఅన్నివేళలా ఆనందమే యేసులో ఉన్నవారికి
అన్నివేళలా ఆదరణయే యేసుతో ఉన్నవారికి
1) నిన్నటి బాదలు నేటికి లేవు
రేపటి గూర్చిన చింతయు లేదు
తనమహిమలో ప్రతి అక్కర తీరును
తన రెక్కలతో నను కాపాడును
2) అనుక్షణము నా ప్రాణము కాయుచు
అను దినము నా భారము మోయుచు
అంగలార్పును నాట్యము చేసెను
ఆనందముతో నా మదినింపెను
3) అదిగదిగో నా కొరకు దిగివచ్చుచున్నది
పండ్రెండు గుమ్మముల ఆ మహానగరం
వేదన రోదన ఇక నాకుండదు
ప్రియుని వడిలోనే ఆనందింతును
Audio / Video