రాకడనే రైలు బండి
Christian Song Lyrics
Teluguరాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2)
పరిశుద్ధులకందులో చోటున్నది (2)
మంచి చోటున్నది – భలే చోటున్నది
చక్కని సీటున్నది ||రాకడనే||
సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2)
పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి
జీవమునకు మార్గమని కూయుచున్నది – కూత కూయుచున్నది ||రాకడనే||