రుచి చూచి ఎరిగితిని
Christian Song Lyrics
Teluguరుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి||
గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి||
మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి||
మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి||