జీవము గల దేవుని సంఘం
Christian Song Lyrics
Teluguజీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము
మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము
సంకల్పమందున మనముండినా
ఆ సంఘమందున వసియించినా
ఎంతో ఎంతో ధన్యము – (2) ||జీవము||
యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము
సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2)
పాతాళలోక ద్వారములు
దాని ఎదుట నిలువవు (2) ||జీవము||