జుంటె తేనె ధారల కన్నా
Christian Song Lyrics
Teluguజుంటె తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె||
యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె||