జీవితమంటే మాటలు కాదు
Christian Song Lyrics
Teluguజీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
(ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – (2) ||జీవితమంటే||
నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలు
నమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు (2)
ఈ అన్నల నమ్మే కంటే…
ఈ అన్నల నమ్మే కంటే
అన్న యేసుని నమ్ముకో
రాజ్యం నీదే మేలుకో
పరలోకం నీదే ఏలుకో ||జీవితమంటే||