ఎల్లప్పుడును ప్రభువునందు
Christian Song Lyrics
Teluguఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి
ప్రతి సమయములోను…
ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)
యెహోవా చేసిన మేలుల కొరకై
ఎల్లప్పుడును ఆనందించండి (2)
ఆరాధించండి ||ఎల్లప్పుడును||
పాపంబు తోడ చింతించుచుండ
నరునిగా ఈ భువిలో ఉదయించెగా
మన పాప భారం తన భుజమున మోసి
మనకై తన ప్రాణం అర్పించెగా (2)
ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి
ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే ||ఎల్లప్పుడును||