ఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా
Christian Song Lyrics
Teluguఎఱింగి యెఱిఁగి చెడిపోతివి మనసా యిఁక నీ దిక్కెవ్వరు చెపుమా
దురితం బిది స చ్ఛరితం బిది యని యెరుక సరకు గొన కేమియు నీ
||యెఱిఁగి||
1. ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు
ఎదలో ననుభవ మెఱింగి మరల దు ర్మదమున దుష్కృత పదమున
బడితివి ||యెఱిఁగి||
2. సకలముఁ జూచెడు దేవుని కంటికిఁ జాటుగ జరిగెడి పని యేది ఇఁక
జెవి గుసగుస లెల్లను దిక్కులఁ బ్రకటముఁ జేసెడు ప్రభు వున్నాఁడని
||యెఱిఁగి||
3. ఎన్నిమార్లు సిలువను వేయుచుఁ ప్రభు యేసుని వెతబడఁ జేసెదవు
తిన్నని మార్గము తెలిసియుండి నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో
||యెఱిఁగి||
4. గద్దించెడు మనస్సాక్షికి గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై
వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు పరు గెత్తితి వయ్యో ||యెఱిఁగి||