ఎంతో సుందరమైనవి ధర గిరులపై నెం
Christian Song Lyrics
Teluguఎంతో సుందరమైనవి ధర గిరులపై నెంతో యందమైనవి సంత
తంబుఁ బరమ ప్రేమను దెల్ప సంతస మందుచు సరిగ బ్రకటన
జేయ అంతటను బనిఁ బూని ప్రభు న త్యంతముగఁ బ్రక టించి వసుధ
న నంత మగు శుభవార్తఁ జాటెడు వింత యగు బోధకుల పాదము ||లెంతో||
1. మందమతులగు వారలు మూర్ఖత్వంబు నొందు నెల్ల జనంబులు
వందుచుఁ గుందుచు వన గిరి కందరము లందు నున్న సకల మౌ
మోటుజన మెరుఁగఁ పొందుగాఁ ప్రభు యే సొసంగెడు సుందరం
బగు సత్య వాక్యం బందుకొని చాటించుచుండెడు అంద మగు బోధ
కుల పాదము ||లెంతో||
2. మదిలోఁ ప్రభుని నమ్మిన పాపుల నెల్లఁ తుదిని మోక్ష పదమ్మున
విదితమ్ముగాఁ జేర్చి ప్రీతిఁ జూపున టంచు ఇదిగో రమ్మని క్రీస్తు పద
సన్నిధిని జేర్ప సదయులై శుభవార్తమానము ముదమునను మదిలోన నిడి
కొని పదిలముగఁ ప్రకటించుచుండెడి విదితు లగు బోధకుల పాదము
||లెంతో||