ఎవరితో నీ జీవితం
Christian Song Lyrics
Teluguఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2)
దేవుడే నీ జీవిత గమ్యం
దేవ రాజ్యం నీకే సొంతం
గురి తప్పక దరి చేరుమురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||
కష్టాలకు కృంగిపోకురా
నష్టాలకు కుమిలిపోకురా
అశాంతిని చేరనీకురా
తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||