ఎవరూ లేరు ఇలలో ప్రభువా
Christian Song Lyrics
Teluguఎవరూ లేరు ఇలలో ప్రభువా
నీవు తప్ప వేరెవ్వరు లేరు
నీవైపు చూస్తూ నిన్నే ప్రార్థిస్తూ
నీ కొరకు జీవిస్తూ నీ కృపకై వేచి ఉన్నాను
సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి
సర్వశరీరుల కరములు నీవైపు చాచియున్నవి
నీ సేవ తప్ప మాకేదియు లేదు
నీవే మా పోషకుడవయ్యా
నీవు తప్ప మాకెవరు లేరు
నీవే మా దేవుడవేసయ్యా
ప్రాణం ఉన్నంత వరకు నీ సాక్షిగా బ్రతికేదనయ్యా
నీ నిత్య రాజ్యమునకు సిద్ధపడెదను యేసయ్య
నీ రాకకై మేం వేచి ఉన్నామయ్యా
నీవే మా నిత్య జీవమయ్యా
నీ చిత్తాన్ని కనిపెట్టుచున్నామయ్యా
నీవే మా రక్షణ శృంగమయ్యా