ఎవని అతిక్రమములు మన్నింపబడెనో
Christian Song Lyrics
Teluguఎవని అతిక్రమములు మన్నింపబడెనో
పాపపరిహార మెవడొందెనో వాడే ధన్యుండు
1. యెహో వాచే నిర్దోషిగా తీర్చబడియు
ఆత్మలో కపటము లేనివాడే ధన్యుండు ||ఎవని||
2. మౌనియై యుండి దినమెల్ల నే జేసినట్టి
ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను ||ఎవని||
3. దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండ
నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని||
4. నేను నా దోషమును కప్పుకొనక
నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని ||ఎవని||
5. నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా
నీవు నా దోషమును మన్నించితివిగా ||ఎవని||
6. కావున నీ దర్శనకాలమందు
భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు ||ఎవని||