ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను
Christian Song Lyrics
TeluguReference: తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. కీర్తన Psalm 103:13
పల్లవి: ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేను
1. హానికరుడ హింసకుడను - దేవదూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను - ఆదరించినావుగా
2. రక్షకుండా నాకు బదులు - శిక్ష ననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి - చావొందితివి నాకై
3. ఏమి నీ కర్పించగలను - ఏమి లేమి వాడనయ్యా
రక్షణంపు పాత్రనెత్తి - స్తొత్రమంచు పాడెద
4. నీదు నామమునకు యిలలో - భయపడెడు వారి కొరకై
నాథుడా నీ విచ్చు మేలు - ఎంత గొప్పదేసువా
5. నీను బ్రతుకు దినములన్ని - క్షేమమెల్ల వేళలందు
నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చు వాడా పభువా
6. నాదు ప్రాణమునకు ప్రభువా - సేద దీర్చు వాడ వీవు